ఢిల్లీలో ఐఐటీ గ్రాడ్యుయేట్ పై అత్యాచారం, హత్య.. నిందితుడు చెప్పిన విషయాలతో పోలీసుల షాక్!
- ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య
- నిందితుడు 19 ఏళ్ల మాజీ పనిమనిషి రాహుల్ మీనాగా గుర్తింపు
- హత్యకు ముందు రోజు రాజస్థాన్‌లో మరో మహిళపై అత్యాచారం
- కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన నిందితుడు
- దోపిడీ కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల వెల్లడి
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, మరుసటి రోజు ఉదయాన్నే ఢిల్లీకి వచ్చి తన మాజీ యజమాని కుమార్తెపై అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేసిన 19 ఏళ్ల యువకుడి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని కైలాశ్ హిల్స్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుడైన రాహుల్ మీనాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
నిందితుడు రాహుల్ మీనా ఒక ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో 8 నెలలు పనిచేసి, ఆర్థిక అవకతవకల కారణంగా నెల రోజుల క్రితం అతడిని పని లోంచి తీసేశారు. దీంతో పగ పెంచుకున్న రాహుల్ బుధవారం ఉదయం ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లడంతో, అదనపు తాళం చెవి వాడి ఇంట్లోకి ప్రవేశించాడు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న 22 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆ యువతిపై దాడి చేసి, మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి, బరువైన వస్తువుతో కొట్టి అపస్మారక స్థితికి చేర్చాడు.
ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం బయోమెట్రిక్ లాకర్‌ను ఆమె వేలిముద్రతో తెరిచేందుకు ప్రయత్నించి విఫలమై, స్క్రూడ్రైవర్‌తో పగలగొట్టి నగదు, నగలు దోచుకున్నాడు. రక్తంతో తడిసిన బట్టలు మార్చుకుని అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఉదయం 6:49 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి 7:20 గంటలకు బయటకు వెళ్ళిపోయాడు.
పోలీసులు అతడిని ద్వారకలోని ఒక హోటల్‌లో అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. "నా వల్ల నేరం జరిగింది, తప్పు జరిగిపోయింది" అని న్యాయమూర్తి ముందు నిందితుడు తన తప్పును అంగీకరించాడు. ఈ హత్యకు ముందురోజు రాత్రి, అల్వార్‌లో తనకు తెలిసిన వ్యక్తి భార్యపై కూడా రాహుల్ అత్యాచారం చేసినట్లు మరో కేసు నమోదైంది. నిందితుడిని నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే యువతి మరణించిందని తేలింది.